జననేత్రం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి జూన్03//: *కోర్టు, పోలీసుల సమన్వయంతోఇ నెల 5వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలత్ ను విజయవంతం చేద్దామని నందిగామ అదనపు 16 వ అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి పి శ్రీనివాసరావు అన్నారు జులై 3 -25 గురువారం పోలీసులతో మెగా లోక్ అదాలత్ పై సమీక్ష జరిపారు
జులై 3 కోర్టు, పోలీసుల సమన్వయంతోఇ నెల 5వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలత్ ను విజయవంతం చేద్దామని నందిగామ 16 వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయాధికారి న్యాయమూర్తి పి శ్రీనివాసరావు అన్నారు. గురువారం పోలీసులతో మెగా లోక్ అదాలత్ పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా న్యాయాధికారి స్టేషనలవారీగా ఉన్న పెండింగ్ కేసులపై ఆరాతీశారు. వీటిలో రాజీకి వచ్చే కేసులన్నీ లోక్‌అదాలతలో పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయిన ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి వారితో మాట్లాడి పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. చిన్నపాటి తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, భూతగాదాల కేసులను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. 16 వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి , పి శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది టీ వీ ఎస్ శర్మ నందిగామ పట్టణ సి ఐ వై వి వి ఎల్ నాయుడు పట్టణ రూరల్ సిఐ డి చవాన్ మరియు పోలీ్‌స్ సిబ్బంది పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966