*జననేత్రం న్యూస్ బోనకల్ మండలం ప్రతినిధి జూలై06*//: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బోనకల్ మండలంలోని వ్యాపార సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ రోజు అన్ని వ్యాపార సంస్థలు మూసివేసి, వాటిలో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నేతలు కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, బోయినపల్లి వీరబాబు, తెల్లాకుల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సునీత, గుగులోతు నరేష్, ఉప్పర శ్రీను, బూర్గుల అప్పచారి, గద్దె రామారావు, ఎస్.కె. షీలార్, ఎస్.కె. బుజ్జి మేస్త్రి, కొమ్మినేని సీతారాములు, బత్తినేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విజయవంతం కావాలంటే వ్యాపారులు, కార్మికులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
C.E.O
Cell – 9866017966