*విద్యార్థులు చనిపోతున్న స్పందించని ముఖ్యమంత్రిపై మండిపాటు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
*జననేత్రంన్యూస్*హనుమకొండజిల్లాబ్యూరో.జులై07*//:తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని మాజీ ఐపీఎస్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం ఇటీవల పరకాల మండలంలోని మలకపేట సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో బలవన్మరణానికి పాల్పడిన ఏకు శ్రీవాణి సంతాప సభకు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమావేశాన్ని స్వేరోస్ నాయకత్వం నిర్వహించింది తెలంగాణలోని అనేక గురుకుల పాఠశాలలో నేటి వరకు 90 మంది విద్యార్థులు మృతి చెందారని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యార్థులు పిట్టల రాలిపోతున్న మానవత్వాన్ని చూపని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు రాష్ట్రంలో ఎంతోమంది దళిత వెనుకబడిన కులాలకు చెందిన నిరుపేద విద్యార్థులు గురుకుల ఆశ్రమ పాఠశాలలో గతంలో నాణ్యమైన విద్యను అందుకునేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు తమ మెడలలో పథకాలను ధరించాల్సిన స్థితిలో ఉండాల్సి ఉండగా ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా మెడలకు ఉరితాలు వేసుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు గత ప్రభుత్వ హయాం లో విద్యారంగం బలోపేతమైందని ఆ ఫలాలు రాష్ట్రంలోని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అందుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసించిన లక్షలాది మంది విద్యార్థులు దేశంలోని పేరు మోసిన యూనివర్సిటీలలో విద్యను అభ్యసిస్తున్నారని ఆయన అన్నారు విద్యారంగంలో ప్రమాణాలు పెంచడం కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించిందన్నారు గత ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు సాంస్కృతిక రంగం బలేపేతంతో పాటుగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఆ ప్రయత్నంలో ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటల్లో పోటీపడి ప్రపంచ దృష్టిని ఆకర్షించి తెలంగాణకు వన్నెతెచ్చారని ఆర్ఎస్ గుర్తు చేశారు రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్ద పెట్టుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో 90 మంది విద్యార్థిని విద్యార్థుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని మాజీ ఐపీఎస్ మండిపడ్డారు ప్రభుత్వాన్ని నడపడం చేతకాకపోతే దిగిపోవాలని ఆయన హెచ్చరించారు
*విద్యార్థులు చనిపోతున్న పట్టించుకోని స్పందన లేని సీఎం పై మండిపాటు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
తెలంగాణలో సౌకర్యాలు లేని కారణంగా సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడుతున్న స్పందించని ముఖ్యమంత్రి తీరుపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు సోమవారం పరకాల పట్టణంలోని గార్డెన్లో నిర్వహించిన ఏకు శ్రీవాణి సంతాప సభకు ఆయన హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల ప్రాణాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్న వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు వారి మరణాలకు కారణాలను అన్వేషిస్తూనే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో మరెక్కడు దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనీసం మానవత్వం లోపించిందని మృతి చెందిన ఏ ఒక్క కుటుంబాన్ని ఇప్పటివరకు ఆయన సందర్శించి పరామర్శించకపోవడంపై ఆయన నైజం బయటపడుతుందని అన్నారు తెలంగాణ ప్రజలను పరిపాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏనా లేక కొంతమంది వ్యక్తుల సమూహమా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణలోని అన్ని రకాల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఎన్నో రకాలైన సౌకర్యాలను అందించిందన్నారు ఆ ఫలితమే తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఎంతోమంది దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలను పొందిన విషయాన్ని ధర్మారెడ్డి గుర్తు చేశారు ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థులకు కావలసిన పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందించలేదని ఎద్దేవా చేశారు అట్లాంటప్పుడు వారు చదువు సక్రమంగా ఎట్లంగా కొనసాగుతుందని ఆయన ప్రశ్నించారు విద్యాసాగర్ నిర్వహించడం ముఖ్యమంత్రి కి సాధ్యం కాకపోయినట్లయితే ఆ శాఖను వేరే ఒక మంత్రికి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడిచిపోయిన విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రిగా ఉండి ఒక్కసారి అయినా సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఏకూ శ్రీవాణి కుటుంబ సభ్యులకు పూర్తి భరోసానిచ్చారు తమ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందన్నారు సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర జిల్లా నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966