*జననేత్రం న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి జులై15*//:వర్షాలు ముఖం చాటేసాయి. మే చివరి వారంలో కురిసిన వర్షాలతో రైతులు ముందు వెనుక చూడకుండా పత్తి విత్తనాలు నాటారు. అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు పడ్డ ఇప్పటివరకు భారీ స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు మొలకెత్తినప్పటికీ వాటిని ఎలా కాపాడాలో తెలియక రైతులు ఆకాశానికేసి ఎదురుచూస్తున్నారు. ఎండలు వేసవిని తలపించే విధంగా ఉండడంతో పత్తి మొక్కల ఆకులు ముడతలు పడి వాలిపోతున్నాయి. హనుమకొండ జిల్లాలోని 14 మండలాలలో గత ఏడాది కురిసిన వర్షాల కంటే జూన్ మాసంలో అతి తక్కువగా వర్షాలు పడ్డట్టు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా మే చివరి వారంలో వర్షాలు పడడం మూలంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు కొంతమంది రైతులు అనుకుంటున్నారు. 14 మండలాల్లోని వివిధ గ్రామాలలో గల అన్నదాతలు వేలాది ఎకరాలలో పత్తి విత్తనాలు నాటారు. మొలిచిన మొక్కలను రక్షించుకోవడం తలకు మించిన భారంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరకాల సబ్ డివిజన్లోని పరకాల నడి కూడా శాయంపేట ఆత్మకూర్ దామెర మండలాలలో ఆశించిన విధంగా వర్షాలు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పరకాల సబ్ డివిజన్లో ప్రధానంగా పత్తి వరి పంటలను ఎక్కువగా పండిస్తారు. వేలాది ఎకరాలలో ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ క్షేత్రాలలో విత్తనాలను నాటారు. బోరు బావులు , బావులు ఉన్న రైతులు మొక్కలను రక్షించుకోవడం కోసం స్పిన్క్లర్ల సహాయంతో మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నీటి సౌకర్యం లేకపోవడంతో దిక్కుతోచక ఆకాశంకేసి తీవ్రమైన నిరాశలో ఎదురుచూస్తున్నారు.
ఆందోళనలో అన్నదాత.
గతంలో ఎప్పుడు లేని విధంగా మే చివరి వారంలో వర్షాలు కురవడంతో రైతులు ఎలాంటి ఆలోచన చేయకుండా ముందస్తుగా పత్తి విత్తనాలు నాటారు. పత్తి విత్తనాలు నాటిన కొద్ది రోజులకు వర్షాలు ముఖం చాటేయడంతో మొలచిన పత్తి మొక్కలను రక్షించుకోవడం ఎలా అన్న ఆందోళనలో అన్నదాతలు తల మునాకలయ్యారు. రైతులు వ్యవసాయ అధికారుల వ్యవసాయ శాస్త్రవేత్తల ఆలోచనలు లెక్కచేయకుండా ముందుగా కురిసిన వర్షాలకు తొందరపడి విత్తనాలు నాటమన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది . వర్షాకాలం ప్రారంభమై సుమారు 40 రోజులు దాటినప్పటికీ హన్మకొండ జిల్లాలో చెప్పుకోదగ్గరీతిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తేలికపాటిగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు కొంత మేరకు సంతోషంగా ఉన్న మొలిచిన పత్తి మొక్కలకు సరిపడే విధంగా పరుషాలు కురవకపోవడంతో మొక్కలను రక్షించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి తడవకుండా మొక్కలకు నీరు అందకుండా ఉండేవిధంగా తేలికపాటి వర్షాలు పడుతున్నాయని దాని వలన మొక్కల్లో పెరుగుదలను లేకుండా ఉండే దుస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ భూముల నుండి వరదలు పారే విధంగా భారీ వర్షాలు లేకపోవడంతో పత్తి మొక్కలు ఎదుగు బదులు లేకుండా ఉంటున్నాయని రైతులు దిగాలు పడుతున్నారు. ఈ స్థితిలో రైతులు మొలిచిన పత్తి మొక్కలు నిలవాలంటే వర్షాలు కురువల్సిందే అన్న రీతిలో ఆకాశాన్ని కేసి ఎదురుచూడడం పరిపాటిగా మారిందని అంటున్నారు. మరికొద్ది రోజులు ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే మొలచిన పత్తి మొక్కలు ఎండిపోయే దుస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు.
C.E.O
Cell – 9866017966