*జననేత్రం న్యూస్ చర్లమండలం ప్రతినిధి జులై15*//: విద్యార్థుల సమస్యల పరిష్కారం నెలకొని ఉన్నసమస్యలనుపరిష్కరించాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు.
PDSU ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం చర్ల మండల ముఖ్య సమావేశం ఈరోజు *జై కుమార్ అధ్యక్షతన జరిగింది.*
ఈ సమావేశంలో కామ్రేడ్ *ముసలి సతీష్ మాట్లాడుతూ* విద్యా రంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమత మవుతున్నారని ఆ సమస్యలను పరిష్కరించకుండా గుళ్ళు గోపురాలకు అని చెప్పి నిధులు కేటాయిస్తూ వాటిని అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థుల కోసం విద్యారంగం కోసం బడ్జెట్ని కేటాయించడం లేదని ఆయన అన్నారు స్కాలర్షిప్ లో రియంబర్స్మెంట్ లు రాక అనేకమంది విద్యార్థులు ఏజెన్సీ ప్రాంతంలో మధ్యలోనే చదువుని మానేస్తున్నారని వారు అన్నారు చర్ల మండలంలో డిగ్రీ కాలేజ్ నిర్మించాలని ఆయన అన్నారు.
అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
మండల అధ్యక్షుడిగా జై కుమార్,
ఉపాధ్యక్షుడిగా రాకేష్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా పరుపు మహేష్, సహాయ కార్యదర్శిగా అబ్దుల్ కరీం కోశాధికారిగా అజయ్ లతోపాటు మరో ఏడుగురిని కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి నవీన్ రెడ్డి తానిస్కాన్ కిరణ్ రవి అబ్దుల్ కరీం అజయ్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966