నీతో నువ్వు గడిపే క్షణాలు మరిచిపోతున్నావు
నిన్ను నువ్వు ప్రేమించడమే మరిచిపోయావు ..
ఎందుకో తెలియదు… ఎక్కడికో పరుగులు తీస్తున్నావు!
ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఎందుకు పరిగెడుతున్నాడో, ఎక్కడికి చేరాలని పరితపిస్తున్నాడో అతనికే తెలియడం లేదు.
పరుగులు పెడుతూ లక్ష్యాలను చేరినా జీవించడం మరిచిపోతున్నారు చాలా మంది
*జీతం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు*
*అవసరాల కోసం వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు*
ఇది విజ్ఞాన శతాబ్దం… అభివృద్ధి, వేగం, టెక్నాలజీ అనే పదాలు ప్రతి నోటా, ప్రతీ చోట వినపడుతున్నాయి. మొబైల్ అలారంతో మొదలయ్యే రోజు టార్గెట్లు, డెడ్‌లైన్లు, మీటింగ్స్ తో ముగుస్తోంది. కానీ ఈ శబ్దాల మధ్య ఓ మౌనం వినిపించదా? అదే బ్రతకడం మరిచిపోవడమే!
*ఉద్యోగం కోసం బ్రతకడమా, బ్రతకడం కోసం ఉద్యోగమా?*
*ఒకప్పుడు జీవించేందుకు పనిచేసేవాడు
*ఇప్పుడు పని చేసేందుకే జీవిస్తున్నాడు
కుటుంబం కోసం పని చేస్తున్నాం… కానీ కుటుంబంతో గడిపేందుకు సమయం లేదు.
ఆర్థిక స్వావలంబన కోసం పరుగులు పెడుతున్నాం కానీ అయినవారికి దూరమవుతున్నాం
పిల్లల ఆలనా,పాలనా చూడకుండా ఉద్యోగానికి వెళ్లే తల్లిదండ్రులు, పిల్లలలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే తపనలో పిల్లలతో సమయం గడపకుండా వారితో ప్రేమగా ఉండకుండా వారు ఎం చేస్తున్నారో చూడకుండా వుండడం పిల్లల భవిష్యత్ దారి తప్పుతుంది .
వారి సంపాదనతో జీవనం సాఫీగా సాగుతోంది అనుకుంటాం కానీ
సంతోషం మాత్రం లేకుండా పోతుంది
*బంధాలు జ్ఞాపకాలుగా మారుతున్న రోజులు ఇవి*
పండుగలు సెలవులుగా మిగిలిపోతున్నాయ్
స్నేహం వాట్సాప్ స్టేటస్ వరకే పరిమితమవుతోంది
అభినందనలు ఈమెయిల్‌ల రూపంలో
పరిచయాలు లింక్డ్‌ఇన్ నోటిఫికేషన్లగా మారుతున్నాయి.
మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతోంది
అవసరాల కోసం స్వార్ధం పెరుగుతుంది
*ఆత్మసంతృప్తే అన్నిటికన్నా గొప్ప విజయం*
సక్సెస్ గురించి తెలుసు… కానీ సంతోషం గురించి?
ఉన్నత స్థితిలో ఉన్నా కానీ మనసు ప్రశాంతంగా ఉందా?
పేరుప్రతిష్ఠ, సంపాదన, పదవులు… ఇవన్నీ ఉన్నా,
నీకు నువ్వు సమయం ఇవ్వకపోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోవడం, చేసే పనిలో సంతృప్తి లేకపోవడం ఎన్నటికీ నీకి ప్రశాంతతను ఇవ్వవు
“నీవు ఎంత సంపాదిస్తున్నావు?” అనే ప్రశ్నకు సమాధానం ఉండవచ్చు
“నీవు సంతోషంగా ఉన్నావా?” అనే ప్రశ్నకు?
*బ్రతకే పనిని వెతకండి… కానీ బ్రతకడం మాత్రం మర్చిపోవద్దు*
ఈ తరం చేసే లోతైన తప్పు – లక్ష్యాల పేరుతో జీవితాన్ని మరిచిపోవడం
పని మనల్ని నిర్విరామంగా పరిగెట్టిస్తోంది
గమ్యాలు మనల్ని గాభరా పెట్టిస్తున్నాయి
కానీ… జీవితం ఏమవుతోంది?
వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి
కానీ జీవితం పట్ల ప్రేమ కూడా ఉండాలి
లక్ష్యాలపై గురి ఉండాలి
కానీ బంధాలు విలువలపై నమ్మకం , బాధ్యత కూడా ఉండాలి
✓ నీకు నీవు సమయం ఇచ్చుకోవడం
✓బంధాలకు విలువ ఇవ్వడం
✓జీవిత ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం
అనేవి ప్రతీ మనిషి ఉత్తమమైన జీవిత ప్రయాణానికి పునాదులు
*జీవితం ఒక గమ్యం కాదు – అనుభూతుల ప్రయాణం*
నువ్వు ప్రేమించాల్సింది గమ్యాన్ని కాదు గమ్యాన్ని చేరే ప్రయాణాన్ని అప్పుడే నీ గమ్యం సులువుగా చేరుకోగలవు
గడిచిన కాలం జ్ఞాపకాలను, నడిచే కాలం అనుభూతులను ఇవ్వాలి
*విజయం ఒక గుర్తింపు కాదు – అంతర్గత సంతృప్తి*
మనమంతా ఎదుగుదల కోసం పరితపిస్తున్నాం
కానీ ఎక్కడినుంచి మొదలైందో మన ప్రయాణం అన్నది మాత్రం మరవొద్దు
పనిలో విజయాలు రావొచ్చు… కానీ జీవితం మాత్రం?
ఆత్మీయతలు కోల్పోతే, ఆ విజయాలకు విలువేంటీ?
బతికే పనిని వెతకండి,
కానీ వెతికే పనిలో బ్రతకడం మర్చిపోవద్దు!
గమ్యాలను చేరండి కానీ ప్రయాణాన్ని ఆస్వాదించడాన్ని మాత్రం మరవద్దు!
*నిన్ను నువ్వు తెలుసుకోలేనప్పుడు, నీకు నువ్వు విలువ ఇచ్చుకోలేనప్పుడు , నీ మీద నీకు ప్రేమ లేనప్పుడు నువ్వు జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో వున్నా నిరుపయోగమే .*
జి. అజయ్ కుమార్
సామాజిక విశ్లేషకులు
C.E.O
Cell – 9866017966