జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాజూలై16*//:తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించబడుతున్న పాశుపత యాగం బుధవారం అత్యంత వైభవంగా, మహా పూర్ణాహుతితో ముగిసింది. ఇట్టి పూర్ణాహుతి కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల ఆచార్యులు పాల్గొని పూర్తి చేశారు. 33 జిల్లాల నుండి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమంను విజయవంతం చేశారు. సుమారు 2 వేల మంది పైగా అర్చకులు పాల్గొని తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిపథంలో కొనసాగాలని, రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ పెద్దలను వేలాది మంది అర్చకులు ఆశీర్వదించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ… ధూప దీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అతిత్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుండి అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి మరింగంటి భార్గవ చార్యులు, కన్వీనర్ అన్నవజ్జుల ప్రసాద శర్మ, యశ్వంత్ శర్మ, నందుల ఉదయ్ శర్మ, మట్టపల్లి మల్లికార్జున శర్మ, ఇంగువ రామకృష్ణ శర్మ, కురిమేటి రామకృష్ణ శాస్త్రి, నరేంద్ర చారి, నాగేంద్ర చారీ, ఇంగువ పూర్ణానంద శర్మ, ఇంగువ సంగమేశ్వర ప్రసాద్, చిలకమర్రి స్వామి నాథన్, చిలుకూరి నాగమూర్తి, ఉమేష్ బాజీపేయి, బుర్ర సుందర్ కుమార చార్యులు, తెరల భాను ప్రసాద్ శర్మ ఇతర నాయకులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966