జననేత్రంన్యూస్.నిర్మల్.జిల్లాప్రతినిధి.జులై16*//:సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలోని అద్దెకు ఇచ్చిన ఒక ప్రైవేట్ భవనం గదిలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని అందిన సమాచారం ఆధారంగా సారంగపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్ మరియు కానిస్టేబుల్ సిబ్బంది హుటాహుటిన దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.38,340/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా పేకాట, మట్కా, జూదం లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన, నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించిన సరఫరా చేసిన స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా, డయల్ 100 ద్వారా లేదా 8712659599 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని, వివరాలు తెలిపిన వారి విషయాలు గోప్యం గా ఉంచబడతాయని తెలిపారు.
C.E.O
Cell – 9866017966