జననేత్రంన్యూస్.హనుమకొoడజిల్లాప్రతినిధిజులై16*//:ఇక్కడకనపడుతున్న చెప్పుల జోళ్లను చూసి ఎవరైనా ఆశ్చర్యపోయేరు.. రైతులు తమకు కావలసిన యూరియా బస్తాలను పొందడం కోసం తమకు బదులుగా చెప్పుల జోలన్ని పెట్టి యూరియా బస్తాలు పొందడం కోసం చేసే ప్రయత్నం ఇది యూరియా బస్తాలు పొందడం కోసం రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు వరుసలో లేనట్లయితే యూరియా బస్తాలు దక్కడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు వరుసలో లేకుంటే తమకు యూరియా బస్తాలు దక్కవనే ఆవేదనతో ఉదయం 6 గంటల నుండి వరుసలో నిలబడడం శిక్షగా మారిందని రైతులు అంటున్నారు గత కొద్ది రోజులుగా పరకాల మండలం తో పాటు వివిధ మండలాలను రైతులు యూరియా బస్తాల కోసం పడుతున్న అగచాట్లు అంతా ఇంత కాదని నిట్టూర్పులు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినందుకు ఈ కష్టాలు తప్పడం లేదని రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.గత 15 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా రైతులు గురువారం పరకాల వ్యవసాయ మార్కెట్లో తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా బస్తాలు పొందాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్లు చేత పట్టుకొని మహిళా రైతులు మండుటెండలో పడుతున్న అకచాట్లను చూసి తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఓ పక్క పత్తి పంటను రక్షించుకోవడమే కాక వ్యవసాయ మార్కెట్లో పచ్చి బస్తాలను పొందడం కష్టంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు వరుసలో నిలబడి బస్తాలను పొందడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఇతర ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా చూడాలని స్థానిక ఎమ్మెల్యే ఎవరు ప్రకాశ్ రెడ్డి తో పాటుగా సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు.
C.E.O
Cell – 9866017966