మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచి కనురెప్పలు అర్పి నిద్రపోతున్న ఓ మనిషి..!
నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి
నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు
ఓ మనిషి..!
నీ బంధుగణంకోసం, నీ రక్తసంబంధం కోసం,
నీ వాళ్ళ కోసం కుళ్ళు,కుతంత్రాలు చేసి
కూడబెట్టిన నీ పైకంపై డేగలా వాలారే తప్ప….
ఒక్కరు కూడా నీ దారిదాపుల్లోకి రాలేదు..!
నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి
నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు
ఓ మనిషి..!
సంపాదించు కోవాల్సింది కేవలం ఆస్తి అంతస్తులు
మాత్రమే కాదు నలుగురు మిత్రులనికూడా అని
మరవకు ఓ మనిషి..!
నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి
నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు
ఓ మనిషి..!
బందుజనం స్మశానం వరకు వస్తే…,
తలపై రూపాయి నాణెం ఒంటిపై తెల్లని వస్త్రం
నోట్లో గుప్పెడు బియ్యం నీతో కలిసి బూడిద
అయితాయే తప్ప నీతో కలిసి రావు ఒక్క
నీ మంచితనం తప్ప అది తెలుసుకో ఓ మనిషి..!
నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి
నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు
ఓ మనిషి..!
నీకు చేతనైతే నలుగురికి సాయంచేయి, కానీ
కీడుమాత్రం చేయకు ఓ మనిషి..!
పెన్ను రాయను అని మొరాయిస్తున్న నిష్ణాతులైన
మహనీయుల, అనుభవజ్ఞుల మాటలను
సిరాగా నింపి….
జలజల రాలుతున్నా మథురమైన అక్షరాలను
కవిత రూపంలో మీ ముందు పెట్టాను. తప్పులు
ఉంటే మంచి మనసుతో మన్నిస్తారని ఆశిస్తూ..
రచన ✍️మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
C.E.O
Cell – 9866017966